
మొదటి రెండు సినిమాలైన ‘ముకుంద’, ‘కంచె’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మూడవ సినిమా ‘లోఫర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ మొదటి సారి పక్కా మాస్ హీరో పాత్రలో కనిపించనున్నాడు. ఈ నెల 7వ తేదీన ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ కూడా పూర్తవడంతో ఈ సినిమాని డిసెంబర్ 17న పక్కాగా రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తరహాలో పూరి మదర్ సెంటిమెంట్ తో రూపొందించిన ఈ సినిమాలో రేవతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్ర పోషించాడు. వరుణ్ తేజ్ ఓ దొంగగా కనిపించే ఈ సినిమా ద్వారా దిశా పటాని హీరోయిన్ గా పరిచయం కానుంది. సి కళ్యాణ్ నిర్మాత.