బాలక్రిష్ణ చేతుల మీదుగా మెగా హీరో సినిమా టీజర్!


సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ – సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఇంటిలిజెంట్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు ఆకుల శివ కథ, మాటలు అందించారు.

సి.కళ్యాణ్ నిర్మిచిన ఈ మూవీకి తమన్ అందించిన సంగీతం హైలెట్ కాబోతుందని సమాచారం. సప్తగిరి కామెడి, ‘కొండవీటి దొంగ’ సినిమా నుండి రీమిక్స్ చేసిన ‘చమక్కు చమక్కు’ పాట ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయి. రేపు ఈ సినిమా టీజర్ ను 3:23 గంటలకు నందమూరి బాలక్రిష్ణ విడుదల చెయ్యబోతున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించేలా ఉండబోతుందని తెలుస్తోంది.

Exit mobile version