భారీ స్థాయిలో ‘తొలిప్రేమ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ !

విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ‘తొలిప్రేమ’ చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఈ ప్రమోషన్లలో భాగంగా ఈ నెల 3వ తేదీన భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేశారు. అది కూడా భీమవరంలో కావడం విశేషం. సుమారు 25 వేల మంది వరకు అభిమానులు, ప్రేక్షకులు హాజరుకానున్న ఈ వేడుకలో రకరకాల కార్యక్రమాలను ఏర్పాటుచేయనున్నారు.

అయితే ఈ భారీ వేడుకకు ముఖ్య అథితులు ఎవరైనా వస్తారా, వస్తే వాళ్లెవరు అనే వివరాలు ఇంకా బయటకురాలేదు. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని టీజర్, పాటలు విపరీతమైన ఆదరణను దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 10న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇకపోతే ఈరోజు ఉదయం విడుదలకావల్సిన ట్రైలర్ కూడా వాయిదాపడింది.

Exit mobile version