
‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవి నటించిన చిత్రం ‘కణం’. చిత్రీకరణ పూర్తై సెన్సార్ పనులు కూడా ముగించుకున్న ఈ సినిమా చాల వాయిదాల తర్వాత ఈ నెల 23న రిలీజవుతుందని కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన యూనిట్ మళ్ళీ సినిమా వాయిదాపడ్డట్టు ప్రకటించింది.
ఈసారి ఏకంగా మార్చి 3వ తేదీకి సినిమాను నెట్టేశారు. మరి ఆ రోజైనా చిత్ర విడుదలవుతుందో లేదో చూడాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్ర తెలుగు హక్కుల్ని ఎన్వీఆర్ సినిమాస్ అధినేత ఎన్వీ ప్రసాద్ ఫ్యాన్సీ రేటుకి కొనుగోలుచేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ ద్విభాషా చిత్రంలో నాగ శౌర్య హీరోగా నటించాడు.