జై లవకుశ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ ఈ మూవీ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ కు సంభందించి రకరకాల పేర్లు వినిపించినా చివరికి పూజా హెగ్డే ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం.
హారికా హాసిని బ్యానర్ లో చినబాబు నిర్మించబోతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో హీరో మదర్ పాత్ర కోసం లయను సంప్రదించినట్లు సమాచారం. మరి లయ ఈ చిత్రంలో నటిస్తోందాలేదా అనేది చూడాలి. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో యంగ్ టైగర్ కనిపించబోతున్నాడనిసమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
