టాప్ డైరెక్టర్ విడుదల చేసిన ఓంకార్ గేమ్ షో పోస్టర్ !

యాంకరింగ్ తో కెరీర్ ప్రరంభంచిన ఓంకార్ ప్రస్తుతం మాటివిలో సిక్స్త్ సెన్స్ అనే రియాలిటి షో చేస్తున్నాడు. నిన్న ఈ షో ప్రోమో, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు దర్శకుడు వివి.వినాయక్. ఈ గేమ్ కొత్త రకంగా ఉండబోతోంది. ప్రతివారం ఇద్దరు పాటిస్పెంట్స్ పాల్గొంటారు. తరువాత జరగబోయే సంఘటనను గుర్తిస్తే వారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు.

ఇలాంటి కాన్సెప్ట్ తో ఎంతవరుకు గేమ్ షో రాలేదని చెప్పాలి. త్వరలో ఈ షో ప్రసారం అయ్యే సమయాన్ని వెల్లడించబోతున్నారు మాటివి వారు. రాజుగారి గది 2 సినిమా తరువాత ఓంకార్ ఈ షో చేస్తున్నాడు. షో పూర్తి అయ్యాక మళ్ళి సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు ఓంకార్. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓంకార్ సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Exit mobile version