దాసరి అరుణ్ కుమార్ ‘ఒక్క క్షణం’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. తాజాగా అరుణ్ నాగ చైతన్య సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ కు అంకుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అరుణ్. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉంది.
రమ్యకృష్ణ ఈ మూవీలో చైతుకు అత్త పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాలో చైతు ఇగో పాత్రలో కనిపించబోతున్నాడు. ‘మహానుభావుడు’ సినిమా తరువాత మారుతి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. చైతు ఈ మూవీతో పాటు చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాలో నటిస్తున్నాడు.
