దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో సినిమా !

కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న సినిమా షూటింగ్ ఏప్రిల్ 11 నాటికి దాదాపు షూటింగ్ పూర్తి చేసుకోబోతోందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సంభందించి రకరకాల పేర్లు వినిపించినా ఇంతవరుకు ఎలాంటి టైటిల్ ఖరారు కాలేదని యూనిట్ వెల్లడించింది.

యూత్ ఫుల్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు డార్లింగ్ స్వామి మాటలు రాస్తుండగా అంద్రు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

Exit mobile version