యూఎస్లో షూటింగ్ చేస్తున్న బెల్లంకొండ, పూజ హెగ్డే !


యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న తెలిసిందే. ఇటీవలే ఒక షెడ్యూల్ ను ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. అమెరికాలోని గ్రాండ్ కానియన్, న్యూ యార్క్, న్యూ జెర్సీ వంటి లొకేషన్లలో ఈ షూట్ జరగనుంది.

ఇందులో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడ చిత్రీకరించనున్నారు. 15 రోజుల పాటు జరగనున్న ఈ షూట్లో శ్రీనివాస్, పూజ హెగ్డే, వెన్నెల కిశోర్, తదితరులు పాల్గొంటున్నారు. భారీ బడ్జెట్ ను కేటాయించి అత్యుత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామ నిర్మిస్తున్నారు.

Exit mobile version