‘నా పేరు సూర్య’ థాంక్యు మీట్ కు వేదిక సిద్ధమైంది !

అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ చిత్రం గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషనలను వేగవంతం చేసింది. వాటిలో భాగంగానే రేపు 10వ తేదీన థాంక్యు మీట్ ను నిర్వహించనుంది.

హైదరాబాద్లోని తాజ్ డెక్కన్ లో రేపు సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభంకానుంది. దీనికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. పవన్ రాకతో వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశాలున్నాయి. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకుగాను మంచి ప్రసంశలు దక్కాయి.

Exit mobile version