తమిళ స్టార్ నటుడు ‘సూర్య’ తన 37వ చిత్రాన్ని ‘కె వి ఆనంద్’ దర్శకత్వంలో మొదలు పెట్టనున్నారు . ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు ‘మోహన్ లాల్’ కూడా నటించనున్నారు.
సూర్య నటించబోయే ఈ సినిమాలో సూర్య పాత్రతో సమానమైన మరో పాత్రలో ‘అల్లు శిరీష్’ నటించబోతున్నాడు. స్వతహగా సూర్యాకి వీరాభిమాని అయినా శిరీష్ తనకు ఈ పాత్ర దక్కడం పట్ల చాలాసంతోషపడుతున్నాడు . శిరీష్ ‘గౌరవం’ సినిమాతో కోలీవుడ్ లోకి అరంగేట్రం చేసాడు. అలాగే ‘1971’ అనే సినిమా ద్వారా శిరీష్ మలయాళంలో కూడా అడుగు పెట్టాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ గారితో కలిసి నటించడం విశేషం.
ఇక సూర్య నటించబోయే ఈ కొత్త చిత్రానికి పాపులర్ సంగీత దర్శకుడు ‘హారిస్ జైరాజ్’ సంగీతం అందిస్తున్నారు . ఈ సినిమా చెన్నై ,ఢిల్లీ , బ్రెజిల్ , న్యూయార్క్ మొదలగు ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుకోనుంది . ఈ చిత్రం లాంచ్ డేట్ ని అలాగే ఈ సినిమాలో నటించే హీరోయిన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
