ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’ . ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రేపు సాయంత్రం 4గంటలకి రీలిజ్ చేయనున్నారు . ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది.
‘సినిమా చూపిస్తా మామ , నేనులోకల్’ సినిమాలతో మంచి సక్సెస్ సాధించిన త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకుడు. ‘ ఉన్నది ఒకటే జిందగీ’సినిమాతో రామ్ కు మ్యూజికల్ హిట్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. హలో గురు ప్రేమ కోసమే చిత్రం లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతుంది.
