శ్రీకాంత్ అడ్డాలకు హీరో దొరికినట్టేనా ?

‘కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి బ్లాక్ బస్టర్లను అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2016లో చేసిన ఆ చిత్రం తర్వాత ఇంత వరకు మరో సినిమా చేయని ఆయన తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో ఒక చిత్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ చిత్రంలో యువ హీరో శర్వానంద్ కథా నాయకుడిగా నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అడ్డాల చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ సినిమాకు ఓకే చెప్పారట. అంతేగాక అన్నదమ్ముల కథగా ఉండనున్న ఈ సినిమాలో మరో హీరో కూడ ఉంటారటని తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎవరనే విషయం ఇంకా బయటకు రాలేదు.

Exit mobile version