హైదరాబాద్ తర్వాత ముంబై అంటున్న అజిత్ !

దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ చేస్తున్న తాజా చిత్రం ‘విశ్వాసం’. శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో అజిత్, శివల కాంబినేషన్లో తెరకెక్కిన ‘వివేగం, వేదాళం, వీరం’ వంటి సినిమాలు మంచి హిట్లుగా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన భారీ సెట్లో జరుగుతోంది. ఇంకొద్ది రోజులపాటు అక్కడే షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తవగానే మరొక షెడ్యూల్ కోసం ముంబై వెళ్లనున్నారు అజిత్ అండ్ టీమ్.

ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయకిగా నటించనుండగా డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడ ఈ చిత్రాన్ని ‘విశ్వాసం’ పేరుతోనే విడుదలచేయనున్నారు.

Exit mobile version