‘బిగ్ బాస్ 2’ లో పాల్గొనన్న హీరో !

హీరో నాని వ్యాఖ్యాతగా ‘బిగ్ బాస్ -2’ త్వరలో ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంభదించిన ప్రోమోలు కూడ టీవీల్లో ప్రసారమవుతున్నాయి. జూన్ 10 నుండి ఈ సీజన్ టీవీల్లో ప్రత్యేక్ష ప్రసారంకానుంది. గత ఏడాది తారక్ అద్భుతమైన హోస్టింగ్ తో హిట్టైన బిగ్ బాస్ ఈసారి ఎలా ఉంటుందో, కంటెస్టెంట్స్ ఎవరో చూడలానే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఈ నేపథ్యంలో హీరో తరుణ్ ఈ రియాలిటీ షోలో పాల్గొంటారని వార్తలొచ్చాయి. వీటిపై స్పందించిన తరుణ్ తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడంలేదని ఖచ్చితంగా చెప్పేశారు. అసలు ఆయనకు ఆ ఉద్దేశ్యం కానీ, ఆసక్తి కానీ లేవని తేల్చారు. దీంతో తరుణ్ పై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. ప్రస్తుతం తరుణ్ హీరోగా పూర్వ వైభవాన్ని అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Exit mobile version