సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా . ఈ సినిమా ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది . ఇటీవల రజినీకాంత్ కావేరి నది జలాల ఫై చేసిన వాఖ్యలతో కర్ణాటకలో ఈ సినిమాని నిషేదించిన సంగతి మనకు తెలిసిందే . అయితే ఈ విషయంఫై ట్విట్టర్ ద్వారా స్పందించారు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.
కావేరి నది జలాల ఫై రజినీకాంత్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. అయినా ‘కాలా’కు కావేరి జలాలకు సంభందం ఏమిటని, సినిమా విడుదలను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదన్న ప్రకాష్ రాజ్ సినిమా రిలీజ్ కాకుంటే ఆ చిత్ర నిర్మాతలు పడే వేదనను అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక ఈ విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా లేక ‘పద్మావత్’ సినిమా విషయంలో బీజేపీ చేసినట్లే చేస్తాయా అని ప్రశ్నించారాయన.
