తెలుగు సినిమాకి ‘హీరోయిజం’ నేర్పింది ఎన్టీఆరే !

ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి’ చిత్రమే తెలుగు సినిమాల్లో ‘హీరోయిజం’ అన్న ట్రెండ్ ను సృష్టించింది. అంతకు ముందు ఎన్నో జానపద చిత్రాలు వచ్చినా, కథానాయకుడి పాత్రను అంతటి ధీరోదాత్తునిగా తీర్చిదిద్దింది లేదు. కేవీ రెడ్డిగారు పింగళిగారిని దగ్గర కూర్చోపెట్టుకొని ‘పాతాళభైరవి’లోని కథానాయకుడి పాత్ర రాయించుకున్నారట. అందుకు తగ్గట్టుగా తోటరాముడు పాత్రకు ఎన్టీఆర్ జీవం పోశారు.

ఒకవిధంగా ఎన్టీఆర్ కు మొట్టమొదటిగా స్టార్ డమ్ తెచ్చిన పాత్ర, తెలుగు సినిమాకి ‘హీరోయిజం’ అద్దిన పాత్ర.. ‘పాతాళభైరవి’లోని తోటరాముడు పాత్రే. మొదట ఈ పాత్రలో ‘అక్కినేని’ని కూడా అనుకున్నారట. కానీ రెడ్డిగారికి తోటరాముడి పాత్రలో ఎన్టీఆర్ అయితేనే బాగుంటుదని ఎన్టీఆర్ తోనే పాతాళభైరవి’ తీశారు. ఈ చిత్రం అప్పటి రికార్డ్ లను తిరగరాసింది.

Exit mobile version