వైఫ్ ఆఫ్ రామ్’ బాగా ఉత్కంఠ కలిగిస్తుందట !

manchu

ఎలకంటి విజయ్ దర్శకత్వంలో ‘మంచు లక్ష్మి’ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం w/o రామ్ . ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సప్సెన్స్ తో ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని ‘U/A’ సర్టిఫై తో ఈ నెల 20న గ్రాండ్ గా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.

కాగా ఈ చిత్రం ఇన్వెస్టిగేట్ తో కూడుకున్న ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అట. ఆసాంతం సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుందని తెలుస్తోంది. ఒక సాధారణ హౌస్ వైఫ్ గా నటించిన మంచు లక్ష్మి నటన ఈ చిత్రానికి ప్రధాన బలం కానుంది. తన భర్తను ఎందుకు చంపారు ? ఎవరు చంపారు ? అని తెలుసుకోవటానికి ప్రయత్నించే ఓ సగటు భార్య పాత్రలో మంచు లక్ష్మి నటించారు. ఆమెతో పాటుగా ఆదర్శ్ బాలకృష్ణన్, శ్రీకాంత్ అయ్యర్, సామ్రాట్ రెడ్డిలు కూడా పలు కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version