మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్న’గూఢచారి’ హీరోయిన్ !

tn Shobita Dulipalla 10

అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించి తన నటన తో ఆకట్టుకుంటుంది తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ్ల. తెనాలి ప్రాంతానికి చెందిన శోభితకు తెలుగులో ఇదే మొదటి సినిమా. మాజీ మిస్ ఇండియా అయినా ఈ హీరోయిన్ ఇప్పుడు మళయాలం సినిమాలో నటించనుంది.

మలయాళ సెన్సేషనల్ హీరో నివిన్ పౌలీ నటించనున్న ‘మూతోన్’ అనే చిత్రంలో శోభిత వ్యభిచారి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈచిత్ర షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక తెలుగులో గూఢచారి చిత్రం తరువాత ఆమె ఇప్పటివరకు మరో చిత్రానికి సైన్ చేయలేదు.

Exit mobile version