టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా రివెంజ్ డ్రామాగా, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో రూపొందుతోంది. ఇందులో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఒక కీలక అప్డేట్ ఇచ్చాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘డెకాయిట్’ ట్రైలర్ను ఏప్రిల్ 4న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను ఈ ట్రైలర్ మరో స్థాయికి తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి డెకాయిట్ చిత్రంతో అడివి శేష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
