బ్లైండ్‌ క్యారెక్టర్‌ తో మెప్పించబోతున్న హీరో కూతురు !

ఒక్కప్పటి హీరోగా ఇప్పటి బహుభాషా నటుడిగా శరత్‌ కుమార్‌ ఎంతో పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ అటు హీరోయిన్ గా ఇటు వైవిధ్యమైన పాత్రలను పోషించే నటిగా తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ప్రస్తుతం ఆమె జేకే అనే ఓ నూతన దర్శకుని దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ బ్లైండ్‌ క్యారెక్టర్‌ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మొదటిసారిగా ఓ బ్లైండ్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నప్పటికీ వరలక్ష్మీ అద్భుతంగా నటిస్తున్నారంటున్నారు ఆ చిత్రబృందం. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి మాథ్యూ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Exit mobile version