మారుతీ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రాబోతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తుండగా చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకుంది. దాంతో దర్శకుడు మారుతి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్లు త్వరలో విడుదల చేస్తాం. అప్పటివరకూ వేచి ఉండండి. అందరికి ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా మారుతి ట్వీట్ కి మంచు మనోజ్ సరదాగా స్పందిస్తూ.. ‘చాలా బాగుంది. ఈ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నాం. సినిమా యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేస్తూ.. చివర్లో ‘ఫ్రమ్ అఖిల్ ఫ్యాన్స్’ అంటూ నవ్వుతున్న స్మైలీని పెట్టి పోస్ట్ చేశాడు. అయితే ఈ చిత్రం పై అక్కినేని అభిమానులు మాత్రం చాలానే హోప్స్ పెట్టుకున్నారు. మరి వారి హోప్స్ శైలజా రెడ్డి అల్లుడు’ తీరుస్తాడో లేదో చూడాలి.
Tooooooo Gooood 🙂 Can’t wait to watch this 🙂 All the best to the whole team:) From Akhil Fans ?❤️ https://t.co/20OjsT7ey3
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) September 3, 2018
