టీజర్ టాక్ : ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామాగా ప్రదీప్ రంగనాథన్ LIK

LIK

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏప్రిల్ 10న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా తెలుగు టీజర్‌ను విడుదల చేసింది. దాదాపు ఏడు నెలల క్రితమే తమిళంలో వచ్చిన ఈ టీజర్, ఇప్పుడు చిన్నపాటి మార్పులతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. 2040 నాటి కాలానికి సంబంధించిన ఫ్యూచరిస్టిక్ అంశాలతో కూడిన ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా కనిపిస్తోంది. ప్రస్తుత కాలంలోని ఇన్‌స్టంట్ రిలేషన్‌షిప్స్ ఇష్టపడని ధీమా(కృతి శెట్టి), పాతకాలం నాటి స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటుంది. అయితే, వీరి ప్రేమకథకు అడ్డుపడే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ యజమాని సూర్య (ఎస్.జె. సూర్య) పాత్ర ఆసక్తికరంగా ఉంది. అసలు అతను వీరిని ఎందుకు అడ్డుకుంటున్నాడు అనే అంశం వెండితెరపైనే చూడాలి.

లేడీ సూపర్‌స్టార్ నయనతారతో పాటు ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. యోగి బాబు, సీమన్, గౌరీ కిషన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో శ్రీ పద్మిని సినిమాస్ విడుదల చేస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం యూత్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version