తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా రూపొందుతున్న అత్యంత భారీ చిత్రం 2.ఓ. తెలుగు తమిళ ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా, ఈ ఏడాది చివరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
అయితే విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13వ తేదీన టీజర్ ను గ్రాండ్ గా విడుదల చెయ్యాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్ర విడుదల తేదీ కూడా, త్వరలోనే ఫైనల్ అవ్వనుందని సమాచారం.
