
నాని హోస్ట్ గా చేస్తోన్న బిగ్ బాస్ సీజన్-2 శుభం కార్డుకు సన్నద్ధం అవుతుంది. కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ రియాల్టీ షో విన్నర్ ఎవరు అనే ప్రశ్ననే హల్ చల్ చేస్తోంది.
మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం అయినా ఈ షో.. చివరకి విన్నర్ ప్రకటనతో ముగియనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం చివరికి మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లలో కౌశల్ కే ఎక్కువ ఓట్లు పడ్డాయని.. భారీ ఓట్ల మెజారిటీ తో కౌశల్ బిగ్బాస్ సీజన్-2 విన్నర్ గా నిలిచాడని తెలిస్తోంది. ఇక ఈ షో ఫైనల్ కు ప్రత్యేక అతిధిగా వెంకటేష్ రానున్నారట.
మొత్తం 110 రోజులు నడిచే ఈ షో బుల్లితెర పై భారీ రేటింగ్స్ నే నమోదు చేస్తోంది. సీజన్ వన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడంతో తెలుగు ప్రేక్షకులకు ఈ షో ప్రత్యేకంగా మారింది. వారు ఈ షోను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.