బిగ్ బాస్ 3కు కూడా హోస్ట్ చెయ్యాలని వుందట !

Kamal

వివాదాస్పద టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 2కు నిన్నటి తో తెరపడింది. ఇక ఈషో కు గత రెండు సీజన్లనుండి తమిళ్లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక నిన్న జరిగిన ఫైనల్ లో ఆయన మాట్లాడుతూ బిగ్ బాస్ 3కి కూడా హోస్ట్ చెయ్యాలని ఉందని మనసులో మాటను బయటపెట్టారు కమల్. మరి స్టార్ యాజమాన్యం నెక్స్ట్ సీజన్ కు కూడా ఆయనే కొనసాగిస్తుందో లేదో చూడాలి.

ఇక తెలుగు బిగ్ బాస్ 2కు కూడా నిన్నటి తో తెరపడింది. నాని హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్లో కౌశల్ విజేత గా నిలిచాడు. ఇక నాని కి బిగ్ బాస్ 3కు హోస్ట్ గా చేయడం ఇష్టం లేదని నిన్న ఆయన మాటలను బట్టి చూస్తే అర్ధం అవుతుంది. మరి నెక్స్ట్ సీజన్ కు హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారో చూడాలి.

Exit mobile version