సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై న విషయం తెల్సిందే. ఇక ఈచిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. శంకర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ను తప్పకుండ చూడాలని ముఖ్యంగా ఈచిత్రాన్ని 3డి లో చూస్తే థ్రిల్ అవుతామని అంటున్నారు సినీ ప్రేమికులు.
ఇక ఈచిత్రం అటు క్రిటిక్స్ నుకూడా మెప్పించిందని టాక్. రజినీ ,అక్షయ్ ల నటన , శంకర్ టేకింగ్ అలాగే విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్ర విజయం లో కీలక పాత్రను పోషించాయని సమాచారం. ఇక ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలైన నేపథ్యంలో చాలా ఏరియాల్లో మొదటి రోజు బాక్సాఫిస్ రికార్డులను తిరగరరాయడం ఖాయంగా కనిపిస్తుంది.
