దిగ్గజ దర్శకుడిగా మరియు పలు జాతీయ అవార్డుల గ్రహీతగా భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న మృణాల్ సేన్ కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. వయసు బాగా పై బడడంతో ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కాగా ఈ రోజు ఉదయం కలకత్తాలోని తన నివాసంలో ఆయన గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. పద్మ భూషణ్, దాదాసాహెబ్ పాల్కే లాంటి పురస్కారాల్ని పొందిన మృణాల్ సేన్ 1955లో తన మొదటి చిత్రం ‘రాత్ బోరే’తో మొదటిసారిగా దర్శకత్వం వహించారు.
ఇక ఆయన తెలుగులో కూడా ఒక చిత్రాన్ని తీశారు. 1977లో ‘మన ఊరి కథ’ అనే సినిమా ఆయన రూపొందించారు. ఈయన ఎక్కువుగా గిరిజన తెగల పై జరిగే అకృత్యాలను తన చిత్రాల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే సినీ ప్రముఖులు ఈయనకు నివాళులర్పించారు.
