
నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సిద్ధమైంది. అయితే సెన్సార్ లో ఈ సినిమాకు ఒక కట్ కూడా పడకపోవడం విశేషం.
ఇక ఇప్పటికే కథానాయకుడు ప్రమోషన్స్ ను చిత్రబృందం వేగవంతం చేసింది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈబయోపిక్ లో రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను పిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.