భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా ’83’ అనే చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘భజరంగి బాయ్ జాన్’ ఫేమ్ ఖబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ కపూర్ కపిల్ దేవ్ పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ చిత్రానికి ఇంట్రస్టింగ్ క్యాస్ట్ ను సెలెక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల తమిళ హీరో జీవాను వెటరన్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రకు తీసుకోగా తాజాగా మరొక మాజీ ఇండియన్ క్రికెటర్ ,సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మెన్ సంధీప్ పాటిల్ పాత్రకు ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్ ను ఎంపిక చేశారు.
త్వరలోనే ఈచిత్ర షూటింగ్ లండన్ లో మొదలుకానుంది. విష్ణు ఇందూరి , మధు వంతెన , ఖబీర్ ఖాన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్న ఈ చిత్రం 2020 ఏప్రిల్ 10న హిందీతో పాటు తెలుగు , తమిళ బాషల్లో విడుదలకానుంది.
