రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ !

black1

త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్ర‌సాద్ ప్రధాన పాత్రల్లో బాలు ద‌ర్శక‌త్వంలో బ్లాక్ అండ్ వైట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ పై ప్రొడ‌క్షన్ నెం.1గా కొత్త చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లో నివసించే స్వ‌తంత్య్ర భావాలున్న న‌లుగురు అమ్మాయిల‌కు సంబంధించిన క‌థే ఈ చిత్రం.

కాగా ఆ నలుగురు అమ్మాయిల పాత్రల్లో త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్ర‌సాద్ న‌టిస్తున్నారు. కామెడీ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో క‌థానుగుణంగా ఉండే ట్విస్ట్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయట. త్వరలో జరగబోయే కీలక షెడ్యూల్ లో క్లైమాక్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీక‌రించనున్నారు. హిమ బిందు వెల‌గ‌పూడి నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి మే నెల‌లో సినిమాను విడుద‌ల కానుంది.

Exit mobile version