హీరో శర్వానంద్, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ప్రస్తుతం శరవేగంగా తెరెకెక్కుతుంది. కాగా ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోనుంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చిత్రబృందం ఈ సినిమాను మే 31వ తేదీన విడుదల చెయ్యాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ లో శర్వానంద్ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ చిత్రంలో చాలా భాగం విదేశాలలో చిత్రీకరిస్తోన్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా విడుదల చేయనున్నారు.
ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామా సంబంధించిన నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్ తో పాటు కళ్యాణి ప్రియదర్శిని కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
