ఈ హిట్ డైరెక్టర్ మహేశ్ ను ఒప్పించగలడా ?

Mahesh Babu

‘గీత గోవిందం’తో ఎట్టకేలకు పరుశురామ్ తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్ల రూపాయల భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా వల్ల పరుశురాంకి స్టార్ హీరోలు పిలిచి మరి ఆఫర్స్ ఇస్తారని అందరూ అనుకున్నారు.

కానీ ఏ స్టార్ హీరో పిలిచి సినిమాని అయితే ఇవ్వలేదు. చివరికీ క్లోజ్ అనుకున్న బన్నీ కూడా, ఇప్పటికిప్పుడు పరుశురామ్ తో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపలేదు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పరుశురామ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మహేశ్ కి తన కథను కూడా వినిపించాడట, అయితే మహేశ్ ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు సమాచారం. మరి ఫుల్ స్క్రిప్ట్ తో పరుశు రామ్ మహేశ్ ను ఒప్పిస్తాడో లేదో చూడాలి.

Exit mobile version