పేరు మార్చుకున్న సుప్రీం హీరో !

sai dharam

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదట్లో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్ తేజ్ ఇటీవల వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం చిత్రలహరి విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా విజయం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ హీరో.

ఇటీవల విడుదల చేసిన ఈసినిమాలో ని మొదటి సాంగ్ పరుగు పరుగు అనే లిరికల్ వీడియో లో సాయి ధరమ్ పేరును సాయి తేజ్ అని వేశారు. అలాగే సినిమా టైటిల్స్ లోకూడా ఇదే పేరును పడనుందట. మరి ఇలాగైనా సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి సాయి తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రలహరి ఏప్రిల్ 5న విడుదలకానుంది.

Exit mobile version