విశ్రాంతి తరువాత మళ్ళీ షూటింగ్ కు రెడీ అవుతున్న గోపిచంద్ !

Gopichand
మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరుతో తన 26వ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ రాజస్థాన్ లోని జై సల్మేర్ లో 45 రోజులపాటు జరుగగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు గోపీచంద్ కు గాయాలయ్యాయి. దాంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి చాలా రోజులు విశ్రాంతి తీసుకున్న గోపి మళ్ళీ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. ఈచిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఏప్రిల్ 10నుండి ప్రారంభంకానుంది. ఈ షెడ్యూల్ తరువాత బ్రేక్ తీసుకోకుండా ఫాస్ట్ గా షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నాడు గోపిచంద్.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై లో విడుదలకానుంది.

Exit mobile version