ఇస్మార్ట్ శంకర్ బ్రేక్ లేకుండా !

Ismart3

రామ్ , పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్నచిత్రం ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం గోవా షెడ్యూల్ పూర్తి చేసి వెంటనే మరో షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ 1నుండి హైదరాబాద్ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , నాబా నటేష్ కథానాయికలుగా నటిస్తుండగా పూరి టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంభినేషన్ ఫై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. మే లో ఈ సినిమాని విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version