ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలంటే.. మినిమమ్ గ్యారింటీ లేదా హిట్ అన్నంతగా ప్రేక్షకులు ఈ కామెడీ హీరోని ఆదరించారు. కానీ గత కొన్నేళ్లుగా మాత్రం అల్లరి నరేష్ వరుస పరాజయాలతో సతమతవుతున్నాడు. పైగా ఎప్పుడూ గ్యాప్ లేకుండా సినిమాలు చేసే నరేష్.. ఇప్పుడు సినిమా సినిమాకి విరామం తీసుకుంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోని మరి సినిమాలు చేస్తోన్నా.. హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు.
అందుకే నరేష్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం మహర్షి లో నరేష్ మహేశ్ బాబు ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. కాగా నరేష్ పాత్ర సినిమాలో కొంతసేపే ఉన్నా.. కథలో చాలా కీలకంగా ఉంటుందట. అలాగే సినిమాలో మహేష్ – నరేష్ మధ్య ఫ్రెండ్ షిప్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా హైలైట్ గా నిలుస్తాయట. మరి అల్లరి నరేష్ కి మహేష్ బాబు అన్నా హిట్ ఇస్తాడో లేదో చూడాలి.
