మరో వివాదాస్పద సినిమా కోసం వర్మ కసరత్తులు !

Rgv3

రామ్ గోపాల్ వర్మ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారికి శశికళకి మధ్య ఉన్న రిలేషన్ ను బేస్ చేసుకుని ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఫుల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. రైటర్స్ తో వర్మ డిస్కషన్స్ కూడా చేస్తున్నారట.

ఇక జయలలిత మరణానికి సంబంధించి ఎన్నో వివాదాలు, అనుమానులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వర్మ ఈ అంశాన్నే హైలెట్ చేస్తూ సినిమా తియ్యాలనుకోవడంతో ఈ సినిమా పట్ల అమ్మ అభిమానులతో పాటు తెలుగు తమిళ సినీ పరిశ్రమల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది.

జయలలిత జీవితం ఆధారంగా ఇప్పటికే లేడీ డైరెక్టర్ ప్రియదర్శిని దర్శకత్వంలో ‘ది ఐరన్ లేడీ’, అలాగే దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ లాంటి బయోపిక్స్ వస్తోన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఈ బయోపిక్స్ కి పోటీగా వర్మ బయోపిక్ కూడా రానుంది.

Exit mobile version