ఆ ఏరియాలో మహేష్ “మహర్షి” వసూళ్ల సునామి

Maharshi

ప్రిన్స్ మహేష్ లేటెస్ట్సెన్సషన్ “మహర్షి” మూవీ వసూళ్ల ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 90కోట్ల షేర్ వసూలుచేసిన “మహర్షి” త్వరలో బయ్యర్లకు లాభాల బాటపట్టించే అవకాశం వుంది.

తాజా సమాచారం ప్రకారం ఆదివారం అన్ని షోస్ ముగిసే సమయానికి నైజాం లో “మహర్షి” 25 కోట్ల వసూళ్లు రాబట్టిందంట. చిత్ర నిర్మాతలు నైజాం ఏరియా హక్కులను 22 కోట్లకు అమ్మడంతో ఈ ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ లాభాలు పొందుతున్నారని సమాచారం. రానున్న కొన్ని రోజులలో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాల విడుదల లేని తరుణంలో “మహర్షి” నైజాంలో 30కోట్ల మ్యాజిక్ ఫిగర్ ని చేరుకున్న ఆశ్చర్యం లేదు.

“మహర్షి” మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా మహేష్ సరసన పూజ హెగ్డే నటించారు. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేశ్ ఓ ముఖ్య పాత్ర చేశారు .

Exit mobile version