మారుతున్న బాక్సాఫీస్ ట్రెండ్: తమిళ బ్లాక్ బస్టర్స్‌కు తెలుగులో షాక్.. స్టార్ హీరోల డబ్బింగ్ సినిమాలకు కూడా కష్టకాలం!

Tamil Movies

ఒకప్పుడు తమిళ హీరోల సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయంటే.. బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ హడావిడి కనిపించేది. రజనీకాంత్, కమల్ హాసన్ నుంచి మొదలుపెడితే సూర్య, కార్తీ, శివకార్తికేయన్ వరకు అందరికీ ఇక్కడ సాలిడ్ మార్కెట్ ఉండేది. డబ్బింగ్ సినిమాలతో కోలీవుడ్ నిర్మాతలు టాలీవుడ్‌లో ఈజీగా లాభాలు తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. తమిళనాట బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలు సైతం తెలుగు నాట అడ్రస్ లేకుండా పోతున్నాయి. సబ్జెక్ట్‌లో దమ్ము ఉంటే తప్ప రొటీన్ డబ్బింగ్ సినిమాలను పట్టించుకునే తీరిక మన ఆడియన్స్‌కు లేదని రీసెంట్ రిలీజ్‌లు స్పష్టం చేస్తున్నాయి.

లేటెస్ట్ బాక్సాఫీస్ ట్రెండ్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. రీసెంట్‌గా తమిళంలో సంచలనం సృష్టించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘విత్ లవ్’ (With Love). కేవలం 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ ఏకంగా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. అయితే, అదే సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తే మాత్రం ఓటిటిలో క్లిక్ అయ్యింది కానీ థియేటర్స్ లో అంత రెస్పాన్స్ అందుకోలేదు. కనీసం థియేటర్ల రెంట్స్ కూడా రికవర్ చేయలేకపోయిందంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

మరోవైపు సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi) మూవీ కూడా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహిళా సాధికారత, ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తమిళనాట ఏకంగా రూ. 45 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఇంత పెద్ద హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేద్దామని మేకర్స్ గట్టిగానే ప్రయత్నించారు. కానీ, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కనీస స్పందన లేదు. తెలుగు రిలీజ్‌కు ఎలాంటి డిమాండ్ లేకపోవడంతో ఆ సినిమా మేకర్స్ అయోమయంలో పడిపోయారు.

నోటెడ్ హీరోల పరిస్థితి మరీ దారుణం

కేవలం చిన్న సినిమాల పరిస్థితే ఇలా ఉందనుకుంటే పొరపాటే. ఇక్కడ కోట్లు కలెక్ట్ చేసే మార్కెట్ ఉన్న స్టార్ హీరోల సినిమాలకు కూడా టాలీవుడ్‌లో చుక్కెదురవుతోంది. తెలుగు ఆడియన్స్‌కు ఎంతో ఇష్టమైన హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ‘వా వాతియార్’.. తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అయ్యి మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోగా తెలుగులో విడుదల నిలిచిపోయింది. ఇక శివకార్తికేయన్ లాంటి సూపర్ ఫామ్‌లో ఉన్న హీరో పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. అమరన్ అనే సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టినప్పటికీ ఆయన నటించిన భారీ పీరియాడిక్ పొలిటికల్ డ్రామా ‘పరాశక్తి’ (Parasakthi) అసలు తెలుగులో థియేట్రికల్ రిలీజ్‌కే నోచుకోలేదు. మినిమమ్ బజ్ ని కూడా క్రియేట్ చేయలేకపోవడం సంక్రాంతి పోటీ కారణంగా కూడా ఈ సినిమా నేరుగా ఓటిటిలోనే తెలుగు రిలీజ్ కి వచ్చింది.

Exit mobile version