‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఫస్ట్ లుక్ రెడీ

Kamma Rajyamlo Kadapa Reddl

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. కులాల్ని బేస్ చేసుకుని ఉండనున్న ఈ ప్రాజెక్ట్ పట్ల మొదట్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా వర్మ వెనక్కి తగ్గలేదు. సినిమా చిత్రీకరణను శరవేగంగా జరుపుతున్నారు. అంతేకాదు కొద్దిసేపటి క్రితమే సినిమాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న నటుడిని రివీల్ చేశారు.

చంద్రబాబు వేషధారణలో ఉన్న ఆ నటుడ్ని చూసిన నెటిజన్లు కాస్టింగ్ చేయడంలో వర్మను మించినవారు లేరంటూ కితాబిస్తున్నారు. ఇక రేపు 7వ తేదీ ఉదయం 9 గంటల 27 నిముషాలకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేస్తానని కూడా వర్మ ప్రకటించారు. సినిమా పేరుతోనే రెండు ప్రధాన సామాజిక వర్గాల నడుమ జరిగే రాజకీయ పోరునే వర్మ సినిమాగా తీస్తున్నాడని అర్థమైపోవడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి ఏర్పడింది.

Exit mobile version