ఈ ఏడాది ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో వస్తున్న సీక్వెల్ సినిమా ‘జైలర్ 2’ కూడా ఒకటి. ఈ అక్టోబర్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాతో కోలీవుడ్ హీరో ధనుష్ కూడా సిద్ధంగా ఉన్నాడు.
తాను నటించిన ‘ఓం’ కూడా జైలర్ 2 తోనే రాబోతుంది అనేది మొన్నటివరకూ మాట. కానీ ఇప్పుడు ఈ క్లాష్ నుంచి తప్పుకొని జైలర్ 2 కి తాను సోలో రిలీజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే దసరా బరి నుంచి తప్పుకున్న ధనుష్ నెక్స్ట్ హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్న హీరోతో క్లాష్ కి వెళ్లనున్నాడని తెలుస్తుంది.
ఈ ఏడాది ఆల్రెడీ సూర్య నటించిన రెండు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఇక తన కెరీర్ 45వ సినిమా ఈ దీపావళికి రిలీజ్ కానున్నట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ అలాగే ధనుష్ సినిమాలు క్లాష్ కి వెళ్లనున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో ఇపుడు టాక్ మొదలైంది. సో ఈ క్లాష్ ఎలా ఉంటుందో చూడాలి.
