వరుసగా రెండు సెంచరీలు కొట్టిన సాహో హీరోయిన్ !

Shraddha Kapoor

హీరోయిన్ శ్రద్దా కపూర్ టైం మాములుగా లేదు. ఈ ఏడాది బాలీవుడ్ లో ఆమె వరుస హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నారు. ఆమె తాజా చిత్రాలైన సాహో మరియు ఛిచ్చొరే మంచి విజయం సాధించడంతో పాటు 100కోట్ల వసూళ్లను అధిగమించిన చిత్రాలుగా నిలిచాయి. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రం అక్కడ 150కోట్లకు పైగా వసూళ్లు సాధించి అబ్బురపరిచింది. ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా చేయడం జరిగింది.

ఇక రెండు వారాల క్రితం విడుదలైన ఛిచ్చొరే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం కనబరుస్తుంది. సుశాంత్ సింగ్ హీరోగా తెరకెక్కిన కామెడీ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డ్రామా ఛిచ్చొరే చిత్రాన్ని నితేష్ తివారీ దర్శకత్వం వహించారు. ఈనెల 6న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు 125కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనితో శ్రద్దా బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల చిత్రాలలో నటించినట్లైంది. ఇక ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న స్ట్రీట్ డాన్సర్ మరియు టైగర్ ష్రాఫ్ కి జంటగా భాగి 3 చిత్రాలలో నటిస్తున్నారు.

Exit mobile version