సినిమా తప్ప మరో ఏ విషయం గురించి పెద్దగా పట్టించుకుని త్రివిక్రమ్ మొత్తానికి కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. అది అందరూ చేయలేని బిజినెస్. ఇప్పటికే హారికా హాసిని బ్యానర్ పై నిర్మాణ భాగస్వామ్యం కలిగిన త్రివిక్రమ్ మరో వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవలే.. రాజమండ్రి దగ్గరలోని రాజానగరం రాయుడు అనే కాంప్లెక్స్ థియేటర్ ను త్రివిక్రమ్ కొన్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి, త్రివిక్రమ్ మాటల తూటాలు కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లోని కామెడీనే ఇందుకు ఉదాహరణ. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వీరిద్దరూ రాబోతున్నారు.
కాగా ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమిని టీవీ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటివలే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
