వేణు మాధవ్ మృతి పట్ల పవన్, చంద్రబాబుల సంతాపం

Pawan CBN

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. ఆయన మరణం పట్ల తెలుగు చిత్ర సీమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయనతో కలిసి పనిచేసిన ప్రముఖులు చాలామంది ఆనాటి జ్ఞాపకాలను తలచుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

విషయం తెలిసిన వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ ‘గోకులంలో సీత’ నుండి అనేక సినిమాల్లో కలిసి నటించామని, నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణం బాధాకరమని అనగా టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హాస్యనటుడిగా చెరగని ముద్రవేసిన వేణుమాధవ్ మరణం విచారకరమని, ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారం చేసి ప్రత్యేకతను చాటుకున్నారని అంటూ సానుభూతిని వ్యక్తం చేశారు.

అలాగే సినీ ప్రముఖులు వివి.వినాయక్, వరుణ్ తేజ్, సురేందర్ రెడ్డి, బ్రహ్మజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్, మురళీ
మొహాన్, అలీ లాంటి ప్రముఖులంతా వేణు మాధవ్ మృతి పట్ల విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Exit mobile version