రష్మిక మండన్నాకి ఆ స్టార్ హీరో కావాలట !

Rashmika Mandanna

‘ఛలో’ సినిమాతో టాలీవూడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మండన్నా. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి.. రెండవ చిత్రం ‘గీతగోవిందం’తో ఏకంగా స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది ఈ యంగ్ బ్యూటీ. ప్రస్తుతం స్టార్ హీరోలు మహేష్ బాబు, బన్నీలాంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో నటుస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ.. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న కార్తీ నటించిన ‘సుల్తాన్’ చిత్రంతో అటు తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. అలాగే తమిళ్ స్టార్ హీరో విజయ్ 64 చిత్రంలో కూడా రష్మిక నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే రష్మికకి మాత్రం మరో తమిళ్ స్టార్ తో సినిమా చెయ్యాలని కోరుకుంటున్నట్లు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తమిళ్ స్టార్ హీరో అజిత్‌ సరసన తాను హీరోయిన్ గా చేయాలని, ఆయనతో స్క్రీన్ రొమాన్స్ చేయడానికి తానూ ఎప్పటికీ ఇష్టపడతానని రష్మిక మండన్నా తెలిపింది. ఇక రష్మిక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉంది.

Exit mobile version