పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. చాలా సినిమాల తర్వాత హిట్ కొట్టడంతో పూరి ఈ సారి తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నేందుకు సిద్ధం అయ్యాడు. అయితే ఈ పుట్టిన రోజు వేడుకలను పూరి నిర్మాణ భాగస్వామి ఛార్మి ఏర్పాట్లు చేస్తోందట. రేపే పూరి జగన్నాధ్ పుట్టిన రోజు. మరి ఛార్మి ఏం ప్లాన్ చేసిందో చూడాలి. ఇప్పటికే విజయ్ దేవరకొండతో తమ సినిమా ఉంటుందని పూరి – ఛార్మి కన్ఫర్మ్ చేశారు. ఇక బాలయ్యతో చేయబోతున్న మరో కొత్త సినిమాను పూరి – ఛార్మి రేపు అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నాడు పూరి. విజయ్ దేవరకొండ సినిమా తర్వాత, పూరి.. బాలయ్య బాబుతో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కథ కూడా ఎప్పుడో రెడీ అయిపోయిందట. ఈ కథలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బాలయ్య – పూరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమాలో బాలయ్యను చాల కొత్తగా చూపించాడు పూరి. అందుకే పూరితో మరో సినిమా చేయడానికి తానూ ఎప్పుడూ రెడీనే అని ఆ మధ్య బాలయ్య కూడా చెప్పుకొచ్చాడు.
