బిగ్ బాస్ రియాలిటీ షో మరో వారాంతంలోకి అడుగుపెట్టేసింది. నేడు శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున షో లోకి ఎంటర్ అవుతారు. ఇక ఈ వారం ఇంటి సభ్యుల ప్రవర్తన ఆధారంగా నాగ్ తనదైన శైలిలో షో నిర్వహిస్తారు. ఇంటిలో సరిగా నడుచుకోని వారిని మందలించడం, కొందరికి సలహాలు, కొందరికి సూచనలు ఇలా నేటి బిగ్ బాస్ షో ఆసక్తిగా మారనుంది. అలాగే రెండు వారాల క్రితం ఎలిమినేట్ అయిన అలీ రెజా తిరిగి పునరాగమనం చేయడంతో షో కొంచెం ఆసక్తిగా మారింది.
ఇక ఎలిమినేషన్ కూడా దగ్గరపడటంతో ఈ వారం షో నుండి ఎవరు బయటకు వెళ్లనున్నారనే ఆసక్తిపెరిగిపోయింది. గతావారాలతో పోల్చితే ఈ వారం ఎలిమినేషన్ చాలా ఆసక్తికరం. దానికి కారణం షోలో టాప్ కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్న శ్రీముఖి,వరుణ్,రవి కృష్ణ ,బాబా భాస్కర్ ఈ వారం ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అయినా కూడా టాప్ కంటెస్టెంట్ వెళ్ళిపోయినట్లే లెక్క. శ్రీముఖి హౌస్ కెప్టెన్ కావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఇక వరుణ్, బాబా భాస్కర్ కూడా సేఫ్ అని సమాచారం. దీనితో ఈ వారం రవి కృష్ణ ఎలిమినేట్ అవుతారని మెజారిటీ వీక్షకుల అంచనా.
