ఇక్కడ పవన్ ఐతే అక్కడ కమల్ అట…!

pawan kamal hasan

ఇంకా కేవలం నాలుగు రోజులలో సైరా మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. దీనితో సైరా టీం ప్రొమోషన్స్ లో తలమునకలై ఉన్నారు. నిన్న ముంబై వెళ్లిన చిరు.., అమితాబ్, పర్హాన్ అక్తర్ తో కలిసి అక్కడ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. హిందీలో కూడా సైరా విడుదల అవుతున్న నేపథ్యంలో ఆయన నిన్న అక్కడ వెళ్లడం జరిగింది. ఇక నేడు నిర్మాత రామ్ చరణ్, నటి తమన్నా తో కలిసి చిరంజీవి చెన్నై వెళ్లారు. చెన్నైలో పాత్రికేయుల సమావేశంలో పాల్గొనడం జరిగింది.

కాగా సైరా తమిళ వర్షన్ కి సంబంధించి ఒక ఆసక్తికర వార్త తెలిసింది. అదేమిటంటే…,సైరా చిత్రంలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పిన సంగతి తెలిసిందే, ఐతే తమిళ వర్షన్ లో ఈ వాయిస్ ఓవర్ లోకనాయకుడు కమల్ హాసన్ చెప్పారట. సైరా నరసింహారెడ్డి పాత్ర గొప్పదనాన్ని చెప్పే సన్నివేశాలతో పాటు, పతాక సన్నివేశాలలో హృద్యంగా కమల్ వాయిస్ ఓవర్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. ఇక చిరు పాత్రకి అరవింద స్వామి డబ్బింగ్ చెప్పడం మరొక విశేషం.

Exit mobile version