వరుణ్ తేజ్ తాజా చిత్రం గద్దలకొండ గణేష్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు, మంచి వసూళ్లను సాధిస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్ వరుణ్ ని మాస్ గ్యాంగ్ స్టర్ గా చూపించిన విధానం, వరుణ్ నటన తెలుగు అభిమానులకు బాగా నచ్చింది. దీనితో చిత్ర బృందం విజయవాడ, వైజాగ్ ప్రాంతాలలో జైత్ర యాత్రలు చేస్తున్నారు. కాగా నేడు ఈ చిత్రంలోని ఓ తొలగించిన సన్నివేశం ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఇది ఓ పోరాటసన్నివేశానికి సంభందించినది.
గద్దలకొండ గణేష్ పై పెంచెలయ్య మనుషులు అటాక్ చేసే క్రమంలో వారిని ఎదుర్కొన్న గణేష్, ఫోన్ లో పెంచలయ్యకు వార్నింగ్ ఇచ్చే ఆ సన్నివేశంలో వరుణ్ బీభత్సంగా ఉన్నాడు. రేయ్ గద్దలకొండ నాకు బలం కాదు, నేనే గద్దలకొండకి బలం అని వరుణ్ చెప్పిన డైలాగ్ వళ్ళు గగుర్గొలిపేలా ఉంది. మరి ఇంత మంచి సన్నివేశాన్ని దర్శకుడు ఎందుకు తొలగించారు అన్నది ఆసక్తికరం. ఒక వేళ చిత్ర నిడివి తగ్గించే క్రమంలో ఈ సీన్ తొలగించి ఉండొచ్చు.
14రీల్స్ పతాకం పై హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించగా, అధర్వ, మృణాళిని రవి కీలక పత్రాలు పోషించారు. వరుణ్ కి జంటగా ఈ చిత్రంలో పూజా హెగ్డే నటించారు.
సన్నివేశం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
